వైరల్ వీడియో : టైటానిక్ కొత్త ముగింపు మీరు చూశారా ..!?

February 22, 2021 at 1:25 pm

ప్రపంచ సినిమా చరిత్రలో టైటానిక్‌ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. భాషలతో సంబంధం లేకుండా ఈ అపురూప ప్రేమ కథకు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యారు. అతి పెద్ద ఓడలో ప్రయాణం, అదే టైములో సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువతికి, పేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడికి మధ్య పుట్టిన ప్రేమ చివరికి ఆ ప్రేమ ఎలా విషాదాంతమైందన్న క్రమంలో వచ్చిన టైటానిక్‌ చిత్రం అప్పట్లో పెద్ద సంచలన హిట్ అయింది. 1997లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకంగా 11 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుందంటేనే ఈ చిత్రానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఓ అమూల్యమైన వజ్రంతో కూడిన చైన్‌ను ధరిస్తుంది. చిత్రంలో ఒక సీన్ హీరోయిన్‌ ఆ వజ్రాన్ని సముద్రంలోకి విసిరేస్తుంది.

ఇది టైటానిక్‌ సినిమా చూసిన అందరికి తెలిసిందే. అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. టైటానిక్‌ చిత్రానికి సరికొత్త క్లైమాక్స్‌గా ఉన్న వీడియో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వయసు మళ్లిన పాత్రలో ఉన్న హీరోయిన్‌ వజ్రాన్ని ఓడలో ఉన్న ప్రయాణికులకు ఆ ఓడలో ఉన్న ఓ కుర్రాడు హీరోయిన్‌ దగ్గరకి వచ్చి ఆ వజ్రాన్ని నా చేతికి ఇవ్వమని అడుగుతాడు. దీంతో ఆ వజ్రాన్ని కుర్రాడి చేతికి ఇస్తూ అన్నింటికంటే ముఖ్యమైంది, విలువైందీ మన జీవితమే. ఉన్న జీవితంలో ప్రతీ రోజునూ ఆస్వాదించాలి అంటూ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్‌ చెప్పిన అనంతరం హీరోయిన్‌ ఆ వజ్రాన్ని సముద్రంలోకి విసిరేస్తుంది. దీంతో వజ్రం కంటే జీవితం గొప్ప అని ఈ సీన్‌తో అర్ధం అవుతుంది. మరి ఈ సరికొత్త క్లైమాక్స్‌ మీరూ ఒకసారి చూసేయండి.

వైరల్ వీడియో : టైటానిక్ కొత్త ముగింపు మీరు చూశారా ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts