మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌తో అన‌సూయ జోడి..!

February 21, 2021 at 1:34 pm

అందాల హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మందిలో ఆమె కూడా ఒక‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంద‌రిలాగా ఈ మ‌ధ్య చాలా మంది టీవీ స్టార్లు సినిమాల్లోకి అడుగుపెట్టిన విధంగానే అనసూయ సైతం ఒక‌వైపు వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. రంగ‌మ్మత్త పాత్ర‌లో ఒదిగిపోవ‌డంతో పాటు తెలుగు సినీ అభిమానుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ఇక ఈ సినిమా త‌రువాత మ‌రిన్ని అవ‌కాశాలు పెరిగిన‌ట్లు టాలీవుడ్ టాక్‌.

ఇది అలా ఉంటే అనసూయకు తెలుగులో కాకుండా పరభాషాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఇటీవ‌లే మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయ్యిందట. ఆ సినిమా దర్శకుడు అమల్ నీరద్.. ఆ పాత్రకు అనసూయ అయితే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు మాలివుడ్ స‌మాచారం. అనసూయ ఏప్రిల్‌లో షూటింగ్‌లో అడుగుపెట్టనుంది. ఇటీవల తమిళ సూపర స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన అనసూయ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోను అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ జబర్దస్త్ భామ. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ అనే తెలుగు చిత్రంలో గర్భవతిగా నటించిన అనసూయ.. చావు కబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేయ‌డం విశేషం.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌తో అన‌సూయ జోడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts