టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో విషాదం..ఏమి జరిగిందంటే..!?

February 28, 2021 at 1:38 pm
pooja hegde

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెల‌కొంది. పూజా హెగ్డే బామ్మ అకస్మాత్తుగా మరణించింది. అయితే ఈ మరణానికి కారణాలు మాత్రం బయటకు చెప్పలేదు. కానీ పూజా హెగ్డే మాత్రం కన్నీరు మున్నీరు అవుతోంది. ఆమెతో ఉన్న గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఆమె చెప్పిన మాటలు, చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతోంది. ఈ మేరకు పూజా హెగ్డే చేసిన పోస్ట్ ఎంతగానో వైరల్ అవుతోంది.

pooja hegde

pooja hegde

తన బామ్మ మరణంపై పూజా హెగ్డే స్పందిస్తూ.. ఈ క్యూటీని ఈ రోజు నేను కోల్పోయాను.. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నా సంతోషంగా, బాధలు లేకుండా హాయిగా ఉంటుందని ఆశిస్తున్నాను.. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నవ్వుతూ ఉండటం నేర్పించింది..ఎంతో ధైర్యంగా ఉండటం, ఫ్యామిలీ కోసం ఈగోలను పక్కన పెట్టేయడం అన్నీ నేర్పించింది. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది.. లవ్యూ ఆజీ.. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు నువ్ చేసే సడెన్ కాల్స్.. ఎలా ఉంది.. ఏం జరుగుతోంది.. ఏం తింటున్నావ్.. అంటూ అడిగే ఆ ప్రశ్నలు, వచ్చే ఫోన్స్ ఇకపై నేను మిస్ అవుతాను..ఎక్కడున్నా సరే నీ ఆత్మకు శాంతా కలగాలి అంటూ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది.

టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో విషాదం..ఏమి జరిగిందంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts