ఓటీటీలోకి ‘ఉప్పెన’.. రిలీజ్ డేట్ లాక్‌?

February 23, 2021 at 5:50 pm

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌` సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో విల‌న్ పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ముదులిపేస్తోంది.

డ‌బ్యూ మూవీతో ఏ హీరో కొల్ల‌గొట్ట‌లేని క‌లెక్ష‌న్స్‌ను వైష్ణ‌వ్ తేజ్ రాబ‌ట్టాడు. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇత‌ర భాష‌ల్లోకి రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉప్పెన త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిందట‌.

అంతేకాదు, ఈ సినిమాను ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ చేసేందుకు డేట్‌ను కూడా లాక్ చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

ఓటీటీలోకి ‘ఉప్పెన’.. రిలీజ్ డేట్ లాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts