జోరు మీద ఉన్న వైష్ణ‌వ్‌..!

February 27, 2021 at 3:29 pm

ఉప్పెన చిత్రం సక్సెస్ తో దూకుడు మీద ఉన్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. ఈ ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ హీరో అయిపోయాడు. డెబ్యూ హీరోల రికార్డులన్నీ ఈ ఒక్క సినిమాతోనే తుడి చేసాడు వైష్ణవ్. దాంతో ఈయనతో మూవీస్ చెయ్యాలని నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు హిట్ వచ్చిన తర్వాత వైష్ణవ్ చాలా జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన క్రిష్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఉప్పెన షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు వైష్ణవ్. కొండపాలం పేరుతో ఈ చిత్రం వస్తుంది. ఆ నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాడు.

ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ కావడం విశేషం. ఈ చిత్రం అంతా అడవిలోనే ఉంటుంది. ఉప్పెనకు ముందు ఈ చిత్రం పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ఈ చిత్రం కోసం భారీ మొత్తం అడుగుతున్నారు నిర్మాతలు. దాదాపు 14 కోట్ల వరకు క్రిష్ మూవీ బిజినెస్ చేస్తుంది. మరోవైపు మూడు నాలుగు చిత్రాలని కూడా లైన్ లో పెట్టేసాడు హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పటికే నాగార్జున అన్నపూర్ణ బ్యానర్లో వైష్ణవ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. నూతన దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చి మెగా మేనల్లుడితో సినిమా నిర్మిస్తున్నాడు కింగ్ నాగార్జున. ఈ చిత్రం కోసం వైష్ణవ్ తేజ్ కు మూడు కోట్ల పార్షితోషకం ఇస్తున్నట్లు సమాచారం. మరో వైపు వైష్ణవ నాలుగో చిత్రం ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చేయబోతున్నట్లు వినికిడి. నాని కోసం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఇప్పుడు వైష్ణవ్ కు సెట్ చేస్తున్నారు. అక్కడ నాని నో చెప్పడంతో ఇక్కడ వైష్ణవ ఓకే చెప్పాడు. దాంతో నాలుగో సినిమా అక్కడ చేయబోతున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఏదేమైనా కూడా ఒక్క చిత్రంతోనే మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేసాడు ఈ మెగా వారసుడు.

జోరు మీద ఉన్న వైష్ణ‌వ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts