ఈసారి బ‌న్నీతో ర‌గ‌డ‌కు రెడీ అయిన జ‌య‌మ్మ‌?

February 28, 2021 at 11:10 am

కోలీవుడ్ న‌టి, న‌టుడు శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. హీరోయిన్‌గా ప‌లు చిత్రాలు చేసిన‌ప్ప‌టికీ.. లేడీ విల‌న్‌గానే తమిళ, తెలుగు భాషల్లో సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది వ‌ర‌ల‌క్ష్మి.

ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన వరలక్ష్మి ఇటీవ‌ల రవితేజ ‘క్రాక్’ ద్వారా జ‌య‌మ్మ‌గా తెలుగు ప్రేక్షకుల‌ను అల‌రించింది. ఇక తాజాగా విడుద‌ల అల్ల‌రి న‌రేష్ `నాంది` చిత్రంలో కూడా ఓ ప‌వ‌ర్ పాత్ర‌లో మెరిస‌న వ‌ర‌ల‌క్ష్మికి ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి బ‌న్నీతో వ‌ర‌ల‌క్ష్మి ర‌గ‌డ‌కు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న బ‌న్నీ.. ఆ త‌ర్వాత కొర‌టాల శివతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

ఈసారి బ‌న్నీతో ర‌గ‌డ‌కు రెడీ అయిన జ‌య‌మ్మ‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts