రౌడీ హీరోతో సుకుమార్ మూవీ అప్పుడేనా..?

February 18, 2021 at 11:30 am

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రలోతో ఫుల్ బిజీగా షూటింగ్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్‌‌లో వరుస పాన్ ఇండియా చిత్రాలతో పాటు ఆసక్తికరమయిన కథలతో వరుస చిత్రాలను రూపొందుతున్నాయి. ఈ చిత్రాలని ఒకదానితో ఇంకోటి పోటీ పడకుండా ఒక్కొక్కటిగా వచ్చేందకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌తో చిత్రం చెయ్యటానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వీళ్లిద్దరి సినిమాల పై ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దర్శకుడు సుకుమార్ ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో చిత్రాన్ని ఓకే చేశారు. అయితే విజయ్, సుకుమార్ చిత్రం మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. విజయ్ లైగర్ మూవీ సెప్టెంబర్9న ప్రేక్షకుల ముందకు రానుంది. ఆ తరువాత వెంటనే అక్టోబర్‌లో విజయ్, సుకుమార్ సినిమా మొదలు అవుతుంది అనుకుంటే పొరపాటే. సుకుమార్ కథ ఇంకా కంప్లీట్ కాలేదంట. ఇంకా లైన్ మాత్రమే రెడీ అయిందని వినికిడి. ఆ తరువాత ఈ చిత్రం కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కావాలి. అంటే రౌడీ హీరోతో సుకుమార్ మూవీ అప్పుడేనా ఉండనుంది. వచ్చే సంవత్సరం వేసవికి రౌడీ హీరోతో సుకుమార్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

రౌడీ హీరోతో సుకుమార్ మూవీ అప్పుడేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts