
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `లైగర్`. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ను పూరీ సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో విజయ్ పాత్ర నత్తిగా మాట్లాడుతుందట.
ఏదేమైనా విజయ్ లాంటి ఓ స్టార్ హీరో నత్తి ఉన్న పాత్రలో నటించడం నిజంగా రిస్క్‌తో కూడుకున్న సాహసమే అని చెప్పాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం విజయ్ను అలాంటి పాత్రలో చూసేందుకు ఫుల్ ఎగ్జైట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో విజయ్‌కు తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుంది. ఆమె ఈ చిత్రంలో రఫ్‌గా కనిపించనున్నారు.