ఎన్టీఆర్ కోసం రంగంలో విజ‌య్ సేతుప‌తి..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

February 23, 2021 at 7:46 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, యన్.టీ.ఆర్ ఆర్ట్స్ సినిమా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిని రంగంలోకి దింపుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఉప్పెన‌, మాస్ట‌ర్ వంటి చిత్రాల్లో విల‌న్ అద‌ర‌గొట్టేసిన విజ‌య్‌నే‌.. ఎన్టీఆర్‌ తో పోటీ పడటానికి సరైనోడ‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ట‌. అందుకే ఎన్టీఆర్ సినిమాకు విజయ్ సేతుపతే విలన్ గా ఫిక్స్ చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్‌ను త్రివిక్ర‌మ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఒక‌వేళ ఇదే నిజ‌మై ఎన్టీఆర్‌, విజ‌య్ సేతుప‌తి ఒకే స్క్రీన్‌పై క‌నిపిస్తే.. ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు.

ఎన్టీఆర్ కోసం రంగంలో విజ‌య్ సేతుప‌తి..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts