డ‌బూ ర‌త్నానీ క్యాలెండ‌ర్ షూట్‌లో రౌడీ హీరో..!!

February 24, 2021 at 3:29 pm

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న లైగ‌ర్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యాక్ట‌ర్ మన రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం విజ‌య్ బాలీవుడ్ పై ఫోక‌స్ పెడుతున్నాడు. డ‌బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ షూట్ అంటే ఎంత ప్రాచుర్యం పొందిందో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి డ‌బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ షూట్‌కు గ్రాండ్ డెబ్యూట్ ఇస్తున్నాడు. 2021 డ‌బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ షూట్ ను మంగ‌ళ‌వారం నాడు కంప్లీట్ చేశాడు విజ‌య్ దేవ‌ర కొండ‌. ఈ విష‌యాన్ని డ‌బూ ర‌త్నాని ట్విట‌ర్‌లో ఒక వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు.

విజ‌య్ క్యాలెండర్ షూట్‌ చేయాలనుకున్నాడు. అతను చాలా ఫోటోజెనిక్. విజ‌య్‌ పొడవాటి జుట్టుతో ఉన్న లుక్ , ఆటిట్యూడ్‌, వ్యక్తీకరణలతో నేను మ‌రింత ఎక్కువగా పని చేయగలిగాను. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా విజ‌య్‌తో చేసిన ఈ షూట్ ద్వారా మంచి అనుభవం లభించింది. విజ‌య్ ఎప్పుడూ ఇలాంటివి చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని న‌టుల‌తో చేయాల‌ని ఈ సారి కొత్తగా ఆలోచించాన‌ని డ‌బూ ర‌త్నానీ తన వీడియో ని ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు.

డ‌బూ ర‌త్నానీ క్యాలెండ‌ర్ షూట్‌లో రౌడీ హీరో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts