బాల‌య్య-బోయ‌పాటి సినిమా‌కు ఊహించ‌ని షాక్.. షూటింగ్‌కు బ్రేక్‌!

February 22, 2021 at 1:24 pm

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడోసారి `బిబి 3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్‌ మ‌ళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌కి ఊహించ‌ని షాక్ త‌గిలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ చిత్ర షూటింగ్‌ వికారాబాద్ మండ‌లం కొటాల గూడెంలో జ‌రిపేందుకు చిత్ర బృందం వెళ్ళింది.

అయితే చిత్ర యూనిట్‌ను అక్క‌డి గ్రామ‌స్తులు అడ్డుకున్నాడు. షూటింగ్ వ‌ల‌న పంట పొలాలు పాడ‌వుతాయ‌ని ఇక్క‌డ షూటింగ్ జ‌రిపేందుకు వీల్లేద‌ని గ్రామ‌స్తులు తెగేసి చెప్ప‌డంతో.. చిత్ర యూనిట్ వెన‌క్కి త‌గ్గింది. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ కోసం మ‌రో లొకేష‌న్ వెతికే ప‌నిలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

బాల‌య్య-బోయ‌పాటి సినిమా‌కు ఊహించ‌ని షాక్.. షూటింగ్‌కు బ్రేక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts