వైరల్ ఫోటో: భీష్ముడిగా అలరించిన బాలకృష్ణ..!

February 23, 2021 at 6:59 pm
Balakrishna

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. పౌరాణిక చిత్రాలన్నా, ఇతిహాసాల్లోని పాత్రలన్నా నందమూరి బాలకృష్ణగారికి ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అవకాశం వస్తే ఎప్పుడైనా సరే పౌరాణిక పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయన. ఇక విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన కుమారుడు, నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రాలు ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్ – మహానాయకుడు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయాయి.

Balakrishna

Balakrishna

మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీ‌ఆర్ కథానాయకుడు’ చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ విడుదల చేశారు. ఇంతకీ ఈ గెటప్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలోనిదే. తన తండ్రి నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ఈ సినిమా చేశారు బాలకృష్ణ.

మహాభారతంలో భీష్మాచార్య కథ ఆధారంగా 1962లో వచ్చిన చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు భీష్మ పాత్ర పోషించారు. ఈ పాత్ర అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమట. అందుకే, ఈ పాత్రను ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ సినిమా కోసం బాలకృష్ణ పోషించారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇందులో ఆనాడు ఎన్టీఆర్ చేసిన భీష్ముడి పాత్ర వేషధారణలో కొన్ని సన్నివేశాలు చేశారు. కానీ సినిమా లెంగ్త్ పెద్దది కావడం మూలాన వాటిని సినిమా నుండి తొలగించారు. ఆ ఫోటోలనే బాలయ్య ఈరోజు రివీల్ చేశారు.

భీష్ముడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ పాత్రలో తన తండ్రి ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన నాడు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుందని, అందుకే ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేశామని కానీ లెంగ్త్ పెగడం వలన ఫైనల్ కట్ నుండి వాటిని తొలగించామని ఈరోజు భీష్మ ఏకాదశి సందర్బంగా వాటిని ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నానని అన్నారు.

వైరల్ ఫోటో: భీష్ముడిగా అలరించిన బాలకృష్ణ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts