పాగల్ టీజర్ విడుదల…!

February 18, 2021 at 12:03 pm

టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో విశ్వక సేన్ కూడా ఒకరు. విశ్వక్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ఈ నగరానికి ఏమైందితో అందరిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నామా దాస్ చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంతో విశ్వక్ మాస్‌కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. ఆ వెంటనే హిట్ అంటూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో అందరినీ ఆశ్చర్చపరిచాడు. అయితే విశ్వక్ తనదైన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న చిత్రం పాగల్.ఈ చిత్రాన్ని నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అయితే పాగల్ టీమ్ ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ చేసింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో విశ్వక్ సేన్‌ను ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు.రేయ్, ఎవర్రా నా లవర్‌ని ఏడిపించింది అనే డైలాగ్‌తో విశ్వక్ ఎంట్రీ ఇచ్చారు. ఈ టీజర్‌ రొమాంటిక్ మ్యూజిక్‌తో స్టార్ట్ అవుతుంది. ఇందులో విశ్వక్‌ను పక్కా లవర్ బాయ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.

పాగల్ టీజర్ విడుదల…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts