మళ్ళీ లాక్ డౌన్ అంటే..?

February 24, 2021 at 3:47 pm

గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ తో దెబ్బ తిన్న రంగాల్లో చిత్ర రంగం కూడా ఒకటి. ఆ దెబ్బకు ఈ సంవత్సరం జనవరి వరకూ సినిమా రంగంస్తంభించి పోయింది. జనవరి నుంచి థియేటర్లలో మరలా సందడి మొదలైంది. ఇక థియేటర్లలో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో ఒక్కసారిగా చిత్ర నిర్మాణం కూడా ఊపందుకుంది.నటీనటులు అందరు కూడా ఫుల్ బిజీ. వచ్చే సంవత్సరం వరకూ సినిమాల విడుదల డేట్స్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ పరిస్థితుల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది అన్న వార్త సినిమా వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తుంది. మళ్ళీ లాక్ డౌన్ వస్తుందా. 2020 జనవరి 30 న కేరళ రాష్ట్రంలో వుహాన్ నుండి వచ్చిన విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. కోవిడ్-19 కేసుల సంఖ్య 500 పెరగడంతో 2020 మార్చి 19 న ప్రధానమంత్రి మోడీ మార్చి 22 ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పౌరులందరినీ కోరారు. తరువాత మార్చి 24 న ప్రధానమంత్రి మోదీ రెండవసారి ప్రసంగిస్తూ 21 రోజుల 2020 మార్చి 25 నుండి – 2020 ఏప్రిల్ 14 పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.

ఓ వైపు కరోనా వాక్సిన్ వచ్చిందన్న న్యూస్ సంతోషం కలిగిస్తుంటే, మరో వైపు మహారాష్ర్ట వంటి కొన్ని చోట్ల కరోనా మరలా పుంజుకుంది. కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్ విధించారు అనే న్యూస్ టెన్షన్ పెంచుతోంది. కేరళ బోర్డర్ లో అన్ని రహదారులను కర్ణాటక మూసి వేయటం కూడా ఒకింత టెన్షన్ కి గురి చేసే అంశమే. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పెరిగి షూటింగ్ లకు అంతరాయం కలిగి రిలీజ్ డేట్స్ లో మార్పులు వస్తే మొత్తం తలక్రిందులవుతుంది. ఒక వేళ మళ్ళీ లాక్ డౌన్ అంటూ వస్తే భారీ నష్టం తప్పదనే భయంతో ఉన్నారు అందరు. అలాంటి పరిస్థితి రాకూడదని అందరం ప్రార్థిద్దాం.

మళ్ళీ లాక్ డౌన్ అంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts