సందేశ్ యాప్‌లో వాట్స‌ప్ ‌కంటే అద‌న‌పు ఫీచ‌ర్స్‌..!

February 23, 2021 at 10:09 am

మేకిన్ ఇండియాలో భాగంగా నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటివ్ సెంట‌ర్ రూపొందించిన సందేశ్ యాప్ వాట్స‌ప్‌ను త‌ల‌ద‌న్నుతున్న‌ది. చైనా యాప్‌లో లేని ఫిచ‌ర్స్‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తున్న‌ది. అస‌లు విష‌య‌మేమిటంటే గాల్వన్ ఘటన తో చైనా కు చెందిన అనేక యాప్స్ ను భారత్ బ్యాన్ చేసింది. అదీగాక తాజా వాట్సాప్ యాప్ భద్రత పై వస్తున్న వివాదాలు తెలిసిన‌వే. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయుల గోప్యత పై అనుమానులు కూడా నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే పీఎం మోడీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపులో భాగంగా అనేక మంది తమ తెలివి తేటలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే టిక్ టాక్ ప్లేస్ లో రూప్ సో వంటి యాప్ లను తెరమీదకు తెచ్చి విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా సందేశ్ పేరిట ఓ నూతన యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ లాంచ్ చేసింది.

సందేశ్ యాప్‌లో యూజర్ల డేటాకు పూర్తి రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ మేడిన్ ఇండియా కనుక ఇందులో స్టోర్ అయ్యే డేటా అంతా ఇండియాలోనే ఉంటుంది. కనుక యూజర్ల డేటాకు భద్రత లభిస్తుంది. అదీగాక సందేశ్ యాప్‌లో బర్త్ డే, ప్రొఫెషనల్ వివరాలను కూడా ఎంటర్ చేసే అదనపు సౌకర్యాన్ని క‌ల్పించారు. దీనిని ఫోన్ నెంబర్ తోనే లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ-మెయిల్ ఉన్నా చాలు ఈ యాప్‌ను వాడుకోవడంతో పాటు ఒకటికన్నా ఎక్కువ డివైస్‌లలో యాప్‌ను ఉపయోగించవచ్చు. సౌల‌భ్యం కూడా ఉంది. ఇక వాట్సాప్‌లో ఉన్న బ్రాడ్ క్యాస్ట్ మెసేజెస్‌, గ్రూప్స్, ఇమేజ్‌ల షేరింగ్‌, వీడియో, ఎమోజీలు వంటి ఫీచర్లన్నీ ఈ యాప్‌లోనూ లభిస్తుండ‌గా, అద‌నంగా చాట్ బాట్, లాగౌట్ ఫీచర్లను కూడా పొందుప‌రిచారు. అందువల్ల సందేశ్ యాప్ వాట్సాప్‌కు పోటీ ఇస్తుందని నిపుణులు విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు.

సందేశ్ యాప్‌లో వాట్స‌ప్ ‌కంటే అద‌న‌పు ఫీచ‌ర్స్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)