ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు..అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన వైసీపీ!

February 25, 2021 at 6:12 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడు కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌లె గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

ఎన్నికలు జరిగే మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ.. వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం జిల్లా నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు జిల్లా నుంచి కల్యాణ చక్రవర్తి, విజయవాడ నుంచి కరీమున్నీసా, కడప జిల్లా నుంచి సీ.రామచంద్రయ్య, కర్నూలు జిల్లా నుంచి చల్లా భగీరథ రెడ్డి పేర్లు తాజాగా వెల్ల‌డించిన జాబితాలో ఉన్నాయి.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని మాత్రం వైసీపీ నిలబెట్టడంలేదు. కాగా, గుండుమాల తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి(టీడీపీ), షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్ పదవీ కాలం ముగియనున్న నేప‌థంలో నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతితో మరో ఎమ్మెల్సీ స్థానం, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు..అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన వైసీపీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts