రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

March 1, 2021 at 12:48 pm

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌ర‌మ్ భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న 2021 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రామ్ చ‌ర‌ణ్ `ఆచార్య‌`లో కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసింది. కొర‌టాల శివ ద‌ర్శ‌త‌క్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో చిరంజీవి, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో `సిద్ధ` అనే కీల‌క పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 8 న 2021 విడుద‌ల కానుంది.

అయితే రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఒకే ఇయర్‌లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మ‌రియు ఆచార్య రెండు సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో చెర్రీ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts