
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల తొలి రోజు అయిన నిన్న సంచలనాలు చోటు చేసుకున్నాయి.
నిన్న భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 222 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లే మిగిలాయి. ఫలితంగా ఇవన్నీ ఏకగ్రీవమైనట్టే. వీటిలో 221 చోట్ల వైసీపీ అభ్యర్థులే ఉండడం గమనార్హం. పైగా వీరంతా వైసీపీ రెబెల్ అభ్యర్ధులే.
ఇక ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలోనే అత్యధికంగా 100 ఏకగ్రీవాలు నమోదుకావడం విశేషం. అందులోనూ జగన్ నియోజకవర్గం పులివెందులలో అయితే అన్ని చోట్లా సింగిల్ నామినేషన్లే దాఖలు కావడం మరో విశేషం.