
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘A’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్సాల నిర్మించారు. ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్, ట్రైలర్ ఇలా అన్నింటితో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్.. తాజాగా ‘A’ ర్యాపిడ్ కట్ ట్రైలర్ విడుదల చేసింది.`యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే` అనే డైలాగ్‌తో ప్రారంభం అయిన ఈ ర్యాపిడ్ కట్ ట్రైలర్ ఆధ్యంతం సూపర్ థ్రిల్లింగ్‌గా కొనసాగింది.
ఈ సినిమాలో కథ అంతా ఓ చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తుందని ట్రైలర్ బట్టీ అర్థమవుతోంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఈ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.