
దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆకాశవాణి`. ఈ చిత్రంలో సముద్రఖని, వినయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను రాజమౌళి విడుదల చేశారు. పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, గిరిజనులు ఇలాంటివి టీజర్లో అద్భుతంగా ఉన్నాయి. అడవి బిడ్డల జీవనం.. వారి వ్యథలను కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా టీజర్లో బట్టీ తెలుస్తోంది.
ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది శీను అంటూ సముద్రఖని చెప్పిన డైలాగ్ మినహా ఈ టీజర్లో ఎలాంటి డైలాగ్ లేనప్పటికీ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనే ఆకట్టుకుంది. ఇక టీజర్ చివర్లో చిన్నపిల్లవాడు మర్రిచెట్టు ఊడలతో సయ్యాటలాడుతుండగా.. పక్కన మరో ఊడకు రేడియో కూడా ఊగుతుంటుంది. దీని బట్టీ చూస్తుందో ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. మెత్తానికి ఈ టీజర్ అదిరిపోవడమే కాదు.. సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి.