మ‌హాశివ‌రాత్రికి మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిన `ఆచార్య‌`?

March 6, 2021 at 11:23 am

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. మ‌హాశివ‌రాత్రికి మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది చిత్ర యూనిట్‌.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం నుంచి శివ‌రాత్రి కానుక‌గా ఫస్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో శివుడి మీద ఒక మంచి డివోషనల్ సాంగ్ ఉందట. దాన్నే శివరాత్రి కానుకగా విడుదలచేస్తారని తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.

మ‌హాశివ‌రాత్రికి మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిన `ఆచార్య‌`?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts