20 ఏళ్ల తరువాత వెటరన్ యాక్టర్ రాజ్ కిరణ్ తో సూర్య..!

March 1, 2021 at 3:35 pm

ఇద్దరు ప్రముఖ స్టార్స్ ఒకేమూవీలో కనిపిస్తే సహజంగానే అభిమానుల హడావిడి అంతా ఇంత ఉండదు. కానీ, కొన్ని సార్లు ఇద్దరు ప్రముఖ ఆర్టిస్ట్స్, ఒకే సారి తెర పై కనిపిస్తే కూడా, ఎగ్జైట్మెంట్ ఆగదు. ఇప్పుడు హీరో సూర్య ఫ్యాన్స్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. 20 ఏళ్ల తరువాత ఓ వెటరన్ యాక్టర్ తో సూర్య కలిసి యాక్ట్ చేయబోతున్నాడు.ఆకాశం నీ హద్దురా చిత్రం సక్సెస్ తరువాత పుల్ జోష్ లో ఉన్నాడు హీరో సూర్య. చాలా రోజులుగా ఎదురు చూసిన సూపర్ హిట్ చివరికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన సూర్య 40 ప్రాజెక్ట్ ఉత్సాహంగా కంప్లీట్ చేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.

దర్శకుడు పాండిరాజ్ సారథ్యంలో తెరకెక్కుతోన్న సూర్య 40లో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. నానితో కలసి గ్యాంగ్ లీడర్లో జత కట్టిన ప్రియాంక ఇప్పటికే తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ తో డాక్టర్ చిత్రం చేసిన ఆమె సూర్య పక్కన ఆఫర్ కొట్టేసింది.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ‘సూర్య 40’ మూవీకి హీరో సూర్య కాకుండా మరో నటుడు కూడా ఉన్నారు. అతనే సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కిరణ్‌. 20 ఏళ్ల తరువాత వెటరన్ యాక్టర్ రాజ్ కిరణ్ తో సూర్య. గతంలో వీరిద్దరూ కలసి నందా సినిమాలో నటించారు. 2001లో రిలీజ్ఆ ఆయన ఆ చిత్రానికి డైరెక్టర్ బాల. మళ్లీ ఇరవై ఏళ్ల తరువాత సూర్య, రాజ్ కిరణ్ ఒకేసారి వెండి తెరపై కనిపించబోతున్నారు. అందుకే, కోలీవుడ్ లో వీరి చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి, సూర్య 40 తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించనుందో.

20 ఏళ్ల తరువాత వెటరన్ యాక్టర్ రాజ్ కిరణ్ తో సూర్య..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts