శ్రియకు తృటిలో తప్పిన ప్ర‌మాదం..వీడియో వైర‌ల్‌!

March 3, 2021 at 9:35 am

శ్రియ సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన శ్రియ‌.. ఆ త‌ర్వాత నాగార్జున‌, మ‌హేష్ బాబు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వెంక‌టేష్ ఇలా స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది.

ఇక తెలుగులో పాటు బాలీవుడ్‌లోనూ ప‌లు చేసిన శ్రియ‌..ప్రస్తుతం ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ బ్యూటీ. అయితే తాజాగా కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించారు ఈ జంట. అక్క‌డ శ్రియ‌కు అనుకోని ప్రమాదం ఎదురైంది.

ముచ్చుపిచ్చు దగ్గర శ్రియ కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా పక్కనే ఉన్న ఒక ఒంటె ఉన్నట్లుండి ఆమె వైపుకు దూసుకొచ్చింది. దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ‘టేక్‌ మీ బ్యాక్‌’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా.. ప్ర‌స్తుతం ఈ ఈడియో తెగ వైర‌ల్ అవుతోంది.

శ్రియకు తృటిలో తప్పిన ప్ర‌మాదం..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts