సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బాలీవుడ్ బ్యూటీ..!!

March 2, 2021 at 12:39 pm

ఈమధ్య కాలంలో హీరో, హీరోయిన్‌లు అందరూ కూడా చిత్ర నిర్మాణం, డైరెక్షన్ వంటి వాటి పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. హీరోలు కొందరు సొంత ప్రొడక్షన్ కంపెనీలు మొదలు పెడుతుంటే, మరి కొందరు డైరెక్షన్‌ పై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌ లోనూ ఇదే హవా కొనసాగుతుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తన సొంత ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టింది. ఆలియా భట్ ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె పలు హిందీ చిత్రాలలో నటించింది. ఆర్ .ఆర్ .ఆర్ అనే చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది. ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ లో నటించింది. 2012 లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో ప్రధాన నాయిక పాత్రను పోషించింది.

హిందీ పరిశ్రమలో తనదైన నటనతో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న నటి అలియా భట్. ఈ ప్రొడక్షన్ కంపెనీకి ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ అనే పేరును ఫిక్స్ చేశారు. అంతే కాకుండా ఈ బ్యానర్ ‌పై అన్నీ హ్యపీ చిత్రాలనే తీయాలని అలియా భావిస్తున్నారని టాక్. అందులో భాగంగా ఇందులో మొదటగా చేయనున్న చిత్రం డార్లింగ్స్. ఈ మూవీలో షారుఖ్ ఖాన్, అలియా జంటగా నటించనున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తోన్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆర్‌ఆర్ఆర్‌’లో సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తుండగా, ఆయన జోడీ ఆలియా భట్‌ నటిస్తుంది. ఈ సినిమాను 2022లోనే విడుదల చేయాలనుకుంటున్నాడట రాజమౌళి.

సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బాలీవుడ్ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts