అల్లు అర్జున్‌-కొర‌టాల సినిమాపై న‌యా అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌?

March 6, 2021 at 10:08 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాను 13 ఆగస్టు 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ చిత్రం త‌ర్వాత అల్లు అర్జున్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు తీసుకెళ్లి.. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రణాళికల్లో కొర‌టాల ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. అల్లు అర్జున్‌ కోసం జలకాలుష్యం నేపథ్యంలో వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్న కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌-కొర‌టాల సినిమాపై న‌యా అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts