
కరోనా లాక్డౌన్ తర్వాత ఎందరో సెలబ్రెటీలు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ ఇలా ఎందరో తారలు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఈ బ్యూటీని పెళ్లాడే వ్యక్తి ఎవరో కాదు..టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టుకు బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే.పెళ్లి కారణంగా అతడు ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా తన సొంతూరు గుజరాత్లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు, బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుపమనే అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. అనుపమ తాజాగా గుజరాత్‌కు వెళ్లడంతో పెళ్లి కోసమే అక్కడకు వెళ్లిందని అంటున్నారు. కాగా, గతంలో బుమ్రా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుపమ బహిరంగంగానే చెప్పింది. ఇక బుమ్రాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ కూడా అనుపమనే.