మున్సిపో‌ల్స్‌లో జ‌న‌సేన బోణి.. ఎక్క‌డంటే..!

March 14, 2021 at 11:20 am

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో వైసీపీ అధిక్యం కొనసాగిస్తుండగా కొన్నిచోట్ల టీడీపీ తీవ్రపోటీ ఇస్తోంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ఫలితాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని 4వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తొలిసారి బోణి కొట్టింది. పంచాయతీ ఎన్నికల్లోనూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జనసేన గ‌ట్టి పోటీని ఇచ్చింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురంలోనూ జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అమలాపురంలో 30 వార్డులు ఉండగా.. అందులో 6 స్థానాలు ఏకగ్రీవంకాగా, ప్ర‌స్తుతం 24 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతుండ‌గా 3,4,6,7 వార్డుల్లో జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ జనసేనకు ఆధిక్యం లభించ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. విశాఖ జనసేనలో విషాదం నెలకొంది. విశాఖపట్నం కార్పొరేషన్ లో 11వ వార్డు జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన గోనె భారతి కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు గుండెపోటుతో మృతి చెందారు. ఇక‌ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండ‌గా ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం చేసుకోగా.. పలుచోట్ల ఏకగ్రీవాలతోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇంకొన్నిచోట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 578 వార్డులు ఏకగ్రీవంకాగా, అందులో 570 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ 6, బీజేపీ 1, ఇతురులు ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్నారు.

మున్సిపో‌ల్స్‌లో జ‌న‌సేన బోణి.. ఎక్క‌డంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts