అర‌ణ్య మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

March 1, 2021 at 2:41 pm

రానా హీరోగా ప్రభుసాల్మన్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన మూవీ అర‌ణ్య‌. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. విష్ణువిశాల్‌, జోయాహుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు ఇది వరకే ప్ర‌క‌టించారు. అయితే ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ కానుందో తాజాగా తెలియ ‌జేశారు. రెండు రోజుల‌లో అర‌ణ్య ట్రైల‌ర్ మిమ్మ‌ల్ని అలరించేందుకు రాబోతుంద‌ని స్ప‌ష్టం చేశారు మేకర్స్.

కార్పొరేట్‌ సంస్థల కుట్రల పై పోరాడే ఒక వ్యక్తి కథ అర‌ణ్య కాగా, ఇందులో ఇరవై ఐదేళ్లుగా అరణ్యంలో జీవించే వ్యక్తిగా రానా పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలనను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రం సాగుతుంది అని మూవీ బృందం చెప్పారు. ఈ చిత్రానికి శంతను మొయిత్రా సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రంగ్ దే, అర‌ణ్య చిత్రాలు ఒకే రోజు థియేట‌ర్‌లో రిలీజ్ కావటం విశేషం.

అర‌ణ్య మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts