ఎప్పటికీ పవన్‌ కళ్యాణ్ ఏ నా ఫస్ట్‌ లవ్‌ అంటున్న అషూ రెడ్డి..!!

March 2, 2021 at 2:28 pm

అచ్చం టాలీవుడ్ ప్రముఖ నటి స‌మంత పోలిక‌ల‌తో ఉండి అంద‌రి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ అషూ రెడ్డి. బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఈ అందాల భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే తెగ పిచ్చి. ఓ సారి త‌న ప్రైవేట్ పార్ట్ ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాటూ వేయించుకొని దిగిన పిక్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రిని షాక్ కి గురి చేసింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి రెండు గంట‌ల సేపు మాట్లాడే అవ‌కాశం ద‌క్క‌డంతో ఉక్కిరి బిక్క‌రి అవుతున్న ఈ ముద్దు గుమ్మా త‌న సంతోషాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

నా దేవుడిని మ‌ళ్లీ క‌లుసుకునే ఛాన్స్ వచ్చింది. ఆయ‌నకి నేను వేసుకున్న టాటూ కూడా ఇంకా గుర్తుంద‌ని చెప్పారు. తిరిగి వెళ్లేట‌ప్పుడు, ఆయ‌న స్వ‌ద‌స్తూరితో రాసిన లెట‌ర్ ఇచ్చి పంపారు. చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్‌ కళ్యాణ్ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. అలానే త‌న‌కు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతఙ్ఞతలు చెప్పింది. ఓ నెటిజ‌న్ అషూని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగ‌వ భార్య‌గా ఉంటారా, అని ప్ర‌శ్నించ‌గా అందుకు వెంట‌నే ఎస్ అంటూ రిప్లై ఇచ్చింది అషూ. ప్ర‌స్తుతం ఈ విషయం సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

ఎప్పటికీ పవన్‌ కళ్యాణ్ ఏ నా ఫస్ట్‌ లవ్‌ అంటున్న అషూ రెడ్డి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts