మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!?

March 4, 2021 at 2:47 pm

మందు బాబులకు ఒక చేదు వార్త. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరుకు రోజుకు ఒక్కొక్కరికి రెండు ఫుల్‌ బాటిళ్లు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అంతకు మించి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నెల ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం తో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ తమ సభలకు, రోడ్ ‌షోలకు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలను కూడా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అదే టైంలో సభలకు, రోడ్ ‌షోలకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు రూ. 300ల నుండి రూ.500ల వరకూ రోజువారీ భత్యంగా ఇస్తారు. ఇక మధ్యాహ్నం విందుకి బిర్యానీ అయితే తప్పనిసరి. ఆ తర్వాత ఇళ్లకు తిరిగివెళ్లే ముందు టాస్మాక్‌ దుకాణా నికి వెళ్ళి మద్యం కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు.

ఈ పరిస్థితి వల్ల పీకల దాకా తాగిన మందు బాబులు గొడవలకు పాల్పడుతుంటారు. మందు బాబులకు చేదు వార్త. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరుకు రోజుకు ఒక్కొక్కరికి రెండు ఫుల్‌ బాటిళ్లు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులను నిరోధించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దాని కొరకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఒక వ్యక్తికి రెండు ఫుల్‌బాటిళ్ల కు మించి మద్యాన్ని విక్రయించకూడదంటూ పరిమి తిని విధించింది. రెండు ఫుల్‌బాటిల్స్‌ లభించకపోతే నాలుగు హాఫ్‌బాటిల్స్‌ కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. హాఫ్‌ బాటిల్స్‌ కొరతగా ఉంటే ఎనిమిది క్వార్టర్‌ బాటిళ్ల చొప్పున మందు కొనవచ్చని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts