మాటల మాంత్రికుడితో న‌ట‌సింహం..ఉత్సాహంలో ఫ్యాన్స్‌!

March 1, 2021 at 7:53 am

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే.. బాల‌య్య నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా కూడా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాల‌య్య త్వ‌ర‌లోనే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ వ‌ద్ద అరవింద సమేత లాంటి ఫ్యాక్షన్‌ బేస్ట్‌ కథోటి ఉందట. ఈ కథ బాలయ్యకైతే సిరిపోతుందని భావించిన త్రివిక్ర‌మ్‌.. ఇటీవ‌ల ఆయ‌న‌ను సంప్ర‌దించ‌గా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని ప్ర‌స్తుతం వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

దీంతో బాల‌య్య ఫ్యాన్స్ తెగ ఊత్సాహ ప‌డుతున్నారు. కాగా, త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా పూర్తి కాగానే బాల‌య్య సినిమా ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత‌ వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

మాటల మాంత్రికుడితో న‌ట‌సింహం..ఉత్సాహంలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts