అభిమాని చెంప చెల్లుమనిపించిన బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌!

March 6, 2021 at 2:33 pm

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినీ న‌టుడు, టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తన సొంత నియోజకవర్గంలో గ‌త మూడు రోజులుగా ముమ్మ‌రంగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ అయిన ‌వైఎస్ఆర్సీపీపై ఘాటుగా విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ అభిమాని చెంప చెల్లుమ‌నిపించారు బాల‌య్య‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్రచారంలో భాగంగా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య. అయితే అక్కడ ఫోటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంప చెల్లుమనిపించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. కాగా, బాలయ్యకు కాస్త ఆవేశం ఎక్కువన్న విషయం తెలిసిందే. గతంలో కూడా రెండుసార్లు అభిమానులపై చేయి చేసుకున్నారు.

అభిమాని చెంప చెల్లుమనిపించిన బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts