BB5 సీజన్‌లో పాల్గొననున్న స్టార్‌ సింగర్‌..?!

March 4, 2021 at 3:52 pm

విపరీతమయిన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హిట్‌ షో బిగ్‌బాస్‌. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ షో ఎంతో విజయవంతంగా ప్రసారమవుతోంది. తెలుగులో మొదటి సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు సీజన్లకు కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఐదో సీజన్‌కు కూడా మరోకసారి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి అని టాక్. కాగా తెలుగునాట బిగ్‌బాస్‌ ప్రతిసారి జూన్‌లో ప్రారంభమవుతుండగా గత సంవత్సరం కరోనా వల్ల షో లేట్ గా మొదలైంది. సెప్టెంబర్‌ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన నాల్గో సీజన్‌ డిసెంబర్‌ 20న వైభవంగా ముగిసింది. ఇక ఈసారి సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యతను కనబర్చారు నిర్వాహకులు. యూట్యూబ్‌ స్టార్లను, బుల్లితెర సెలబ్రిటీలను ఇంటిలోకి పంపించారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో కంటెస్టెంట్స్ కి సినిమా, వెబ్‌ సిరీస్‌ అవకాశాలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో ఐదో సీజన్‌లో ఎవరెవర్ని తీసుకుంటారన్న చర్చ సోషల్‌ మీడియాలో మొదలయింది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో పాపులర్ అయిన షణ్ముఖ్‌ జశ్వంత్‌ హౌస్‌లోకి రాబోతున్నాడు అని సమాచారం. తాజాగా ఓ సింగర్‌ కూడా ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ హేమచంద్ర బిగ్‌బాస్‌ షో ద్వారా తన అభిమానులను అలరించనున్నట్లు టాక్. గతంలోనూ అతడికి బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిని తిరస్కరించాడు. మరి ఈసారి అయినా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హల్చల్ చేస్తాడా అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కానీ హేమ చంద్ర కి బిగ్‌బాస్‌ నిర్వాకుల నుంచి పిలుపు వచ్చిందనేది కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న పుకారు మాత్రమే ఏతున్నారు కొందరు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

BB5 సీజన్‌లో పాల్గొననున్న స్టార్‌ సింగర్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts