అరియానా గ్లోరీకి మెగా ఆఫర్..!?

March 4, 2021 at 3:11 pm

యాంకర్‌గా తన కేరీర్‌ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌ షోతో ప్రత్యేక గుర్తింపు పొందినది.ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ ఇంటి నుండి బయటికి వచ్చాక ఫుల్‌ బిజీగా మారింది. యాంక‌ర్‌గా రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ బ్యూటీ ఇప్పుడు వెండితెర పై మెరవనున్నట్టు టాక్. ఇప్పటికే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి అరియానా ఓ చిత్రంలో నటిస్తుంది.

ఆ మధ్య దీనికి సంబంధించిన పిక్స్ కూడా షేర్‌ చేసింది అరియానా. ఇప్పుడు తాజాగా అరియానా మరో బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ మూవీలో అరియానా నటిస్తుంది. శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌ దేవ్‌కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. శ్రీధర్ సీపన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అరియానా గ్లోరీకి మెగా ఆఫర్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts