మాల్దీవుల‌లో రచ్చ రచ్చ చేస్తున్న బాలీవుడ్ నటి బిపాసా..!

March 2, 2021 at 1:19 pm

బాలీవుడ్ అందాల భామ బిపాసా బ‌సు నాలుగు ప‌దుల వ‌య‌స్సులో కూడా యువతకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది. త‌న భ‌ర్త కరణ్‌ సింగ్ గ్రోవర్‌తో క‌లిసి మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తుంది. వీరిద్ద‌రికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే తాజాగా బిపాసా త‌న అందాల‌ను ఆరబోస్తూ ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి నెటిజ‌న్స్‌ను చాలా బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

బిపాసా బ‌సు తెలుగులోను న‌టించిన సంగతి మనకు తెలిసిందే. ట‌క్క‌రి దొంగ సినిమాలో మ‌హేష్ స‌ర‌సన న‌టించిన ఈ అమ్మ‌డు త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాల‌ను అందుకో లేక‌పోయింది. హిందీలో జిస్మ్‌, ధూమ్ చిత్రాలతో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న బిపాసా కొన్నాళ్ల‌కు ప్రముఖ మోడ‌ల్ క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లి చేసుకొని తన వివాహ జీవితం చాలా ఆనందంగా గ‌డుపుతుంది.

మాల్దీవుల‌లో రచ్చ రచ్చ చేస్తున్న బాలీవుడ్ నటి బిపాసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts