బ్రేకింగ్ : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు..నిజమెంతా !?

March 4, 2021 at 2:02 pm

ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒక్కటి అయిన తాజ్‌మహల్‌కు తాజాగా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు శాఖ వారు, వెంటనే పర్యాటకులను అక్కడి నుంచి ఖాళీ చేయించి తాజామహల్‌నుమోడీ వేసేసారు. తాజామహల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం నాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. ఈ క్రమంలో బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో భద్రతను ఫుల్ కట్టు దిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక బలగాలను అప్రమత్తం చేశారు. బాంబు బెదింపు రావడంతో అక్కడ స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టిన పోలీసు వారు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. అసలు ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు ఆరా ఠెసె పనిలో ఉన్నారు. కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు. తాజ్ మహల్‌లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని చెప్పటంతో, వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే తాజ్‌మహల్‌ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా ఐజీ సతీష్‌ గణేష్‌ ధృవీకరించారు. ఇది కేవలం ఫేక్‌ కాల్‌ అని ఆయన పేర్కొన్నారు.

బ్రేకింగ్ : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు..నిజమెంతా !?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts