అనుపమ, బుమ్రా వివాహంపై వచ్చిన క్లారిటీ..!?

March 6, 2021 at 1:50 pm

భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వివాహం వల్ల నాలుగో టెస్ట్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఆడాల్సిన వన్డేలు, టీ 20లకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్‌ను పెళ్లి చేసుకోనున్నాడని కొన్నాళ్ళుగా ప్రచారం జోరుగా జరుగుతుంది. గుజరాత్‌లో బుమ్రా, అనుపమ పెళ్లి జరగనుండగా, వీరిద్దరు అక్కడికి బయలు దేరారని కూడా అనేక వార్తలు వచ్చాయి.

అనుపమ, బుమ్రాల వివాహానికి సంబంధించి ఇంటరెస్టింగ్ గాసిప్స్ పుట్టుకొస్తున్న క్రమంలో అనుపమ తల్లి మలయాళం పోర్టల్‌తో మాట్లాడారు. ఇదంతా ఒట్టి పుకారు. ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ఒక తెలుగు చిత్రం మూవీ షూట్ కోసం అనుపమ గుజరాత్‌కు వెళ్ళిందే తప్ప ఇంకేవిధమయిన కారణం లేదంటూ ఆమె చెప్పారు. అనుపమ తల్లి ఇచ్చిన క్లారిటీతో బుమ్రా పెళ్లి సస్పెన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. తాజాగా సంజన స్పోర్ట్స్ అనలిస్ట్‌ని బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. మరి వీటి పై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

అనుపమ, బుమ్రా వివాహంపై వచ్చిన క్లారిటీ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts