ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!?

March 8, 2021 at 3:05 pm

మహిళ అంటే అభివృద్ధిలో సగభాగమని, కాబ్బటి మహిళల్లాకు ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబానికి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు. తమ ప్రభుత్వం గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం . ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి అంటూ చెప్పుకొచ్చారు. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం.

ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్‌ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ అన్నారు. ఇంకా దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌. 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదలు పెట్టారు. బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.సీఎం చేతుల మీదుగా దేశానికి దిశ అనే పుస్తకం ఆవిష్కరణ కూడా చేసారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ రూపొందించిన దేశానికి దిశ పుస్తకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఇంకా ఏఎన్‌ఎం శాంతి, స్వీపర్ మబున్నీసా, మహిళా కానిస్టేబుల్‌ సరస్వతి, వాలంటీర్‌ కల్యాణీని సీఎం సత్కరించారు.

ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts