
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2 మూవీ షూటింగ్ మొదలు కాగా, అదే రోజు సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ వలన జరిగి ఉంటుందని ఫస్ట్ భావించినప్పటికీ రాను రాను దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటన జరిగి ఉంటుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
మూవీ షూటింగ్ మొదలు కాక ముందు ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ , రావాణాసురుడిలో మానవత్వకోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని చెప్పారు. రావణుడు రాముడితో చేసిన యుద్ధం సరైనదే అనే కోణంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ సైఫ్ అన్నారు. ఈ మాటలతో అందరిలో ఆవేశం మొదలు అయ్యాయి. సైఫ్‌ని సోషల్ మీడియా వేదికగా దూషించడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితులలో చేసేదేం లేక క్షమాపణలు చెప్పాడు సైఫ్ అలీ ఖాన్. ఇంకా కోపం, పంతం తగ్గని కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆదిపురుష్ సెట్‌కు నిప్పంటించినట్టు టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. ఇందులో ఎంత వరుకు నిజం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.