తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..భారీగా పెరిగిన రిక‌వ‌రీ!

March 7, 2021 at 11:30 am

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. రిక‌వ‌రీ కేసులు భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,99,900 కి చేరింది. నిన్న ఒక్క‌రు క‌రోనా కార‌ణంగా మృతి చెందారు.

దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,641 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 207 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,96,373 చేరుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,886 మంది చికిత్స పొందుతుండ‌గా.. వీరిలో 748 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా టెస్టుల సంఖ్య 89 ల‌క్ష‌లు దాటాయి.

తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..భారీగా పెరిగిన రిక‌వ‌రీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts