రేపిస్ట్‌కు త‌గిన శాస్త్రి.. అదే కోసేసిన వివాహిత..!

March 21, 2021 at 11:25 am

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడ‌బిడ్డ‌ల‌పై అఘాయిత్యాల‌కు తెగ‌బ‌డుతూనే ఉన్నారు. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి ఓ రేపిస్ట్‌కు త‌గిన శాస్త్రి చేసింది ఓ వివాహిత‌. ఇక జ‌న్మ‌లో ఏ మ‌హిళ జోలికి వెళ్ల‌కుండా ఉండేలా ఏకంగా అదే కోసేసి బుద్ధి చెప్పింది. త‌న మానాన్ని.. ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. అధికారులు, బాధితురాలు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిధి జిల్లాలోని ఖాధీ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి గురువారం అర్థరాత్రి సమయంలో వ్య‌క్తిగ‌త ప‌నుల కోసం భార్య‌, కుమారుడిని ఇంటి వ‌ద్ద‌నే ఉంచి వేరే ఊరుకు వెళ్లిపోయాడు. 13 ఏళ్ల కుమారుడితో ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌డాన్ని గ‌మ‌నించిన గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి అదునుగా భావించి ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళను కొట్టి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దాదాపు అరగంటపాటు ఉన్నాదితో పోరాడింది మహిళ. అయిన‌ప్ప‌టికీ దుండగుడు ఎంతకీ విడవకపోవడంతో.. తనను తాను కాపాడుకునే క్రమంలో అందుబాటులో ఉన్న కొడవలి తీసుకుని నిందితుడి మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి రాత్రి 1.30 గంటలకు ఫిర్యాదు చేసింది. అధికారులు వెంట‌నే గ్రామానికి చేరుకుని నిందితుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు నిందితుడు సైతం మహిళపై ప్ర‌తి ఫిర్యాదు చేయ‌గా, ఆమెపై ఐపీసీ సెక్షన్ 327 ప్రకారం కేసు నమోదు చేయ‌డం కొస‌మెరుపు. ‌

రేపిస్ట్‌కు త‌గిన శాస్త్రి.. అదే కోసేసిన వివాహిత..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts