కీచ‌క ఉపాధ్యాయుడు.. అవి చూపించాలంటూ..

March 25, 2021 at 1:53 pm

విద్యబుద్దులు నేర్పించాల్సిన గురువు నీచపు పనులకు ఒడిగట్టాడు. కామంతో క‌ళ్లు మూసుకుపోయి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేయ‌డం మొద‌లుపెట్టాడు. ప్రైవేటు భాగాలను ఫొటోలు తీసి పంపించాలంటూ నిత్యం న‌ర‌కం చూపించాడు. ఆ వేధింపుల‌ను తాళ‌లేక స‌ద‌రు బాలిక విష‌యాన్ని తల్లిదండ్రులకు చెప్ప‌డంతో కీచ‌క ఉపాధ్యాయుడి కామ‌లీలు వెలుగులోకి వ‌చ్చాయి. అధికారులు, బాధితుల క‌థ‌నం ప్ర‌కారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చ‌దువుతున్న విద్యార్థినినిపై ఆ పాఠ‌శాల‌లోని ఓ ఉపాధ్యాయుడు క‌న్నుప‌డింది. ఆమె ఫోన్ నంబ‌ర్ తీసుకుని వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతుండేవాడు. ప్రైవేట్ భాగాలను చూపించాలని నిత్యం వేధింపులకు దిగాడు. తనకు సహకరిస్తే పరీక్షలన్నింటిలోనూ మార్కులు, ఇంకా డబ్బులు ఇస్తానని, లేకుంటే 10 వ తరగతి కి పంపించడం కుదరదని భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బాలిక మనో వేదనకు గురైంది.

ఇదిలా ఉండ‌గా కొద్ది రోజులుగా కూతురు ముభావంగా ఉంటుండ‌డం గ‌మ‌నించిన తల్లిదండ్రులు అస‌లు విష‌యం ఆరా తీశారు. దీంతో ఉపాధ్యాయుడి నీచ‌పు ప‌నుల‌ను చెప్పి బోరున విలపించింది. విష‌యం తెలిసి ఆగ్రహానికి గురైన‌ ఆ తల్లిదండ్రులు, కుటుంబీకుల‌తో కలిసి ఉపాధ్యాయునిపై దాడి చేశారు. స్కూల్ లో ఉన్న చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు స్కూల్ కి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ సంఘ‌ట‌న‌పై జిల్లా విద్యాశాఖాధికారులు సైతం స్పందించారు. ఒకవేళ ఉపాధ్యాయుడు నీచపు పనులకు పాల్పడినట్టు తేలితే తప్పకుండ శాఖా పరమైన చర్యలు తీసుకుంటామ‌ని, సస్పెండ్ కుడా చేస్తామని విద్యార్థిని తల్లి దండ్రులకు ఈ సంద‌ర్భంగా వారు హామీ ఇచ్చారు.

కీచ‌క ఉపాధ్యాయుడు.. అవి చూపించాలంటూ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts