బ‌షీరాబాద్‌లో క‌ల‌కలం.. బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

March 23, 2021 at 1:27 pm

కార‌ణాలు ఏమైనా అన్నింటికీ చావే ప‌రిష్కారంగా భావిస్తున్నారు. ఉన్న‌త భ‌విత‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ఆత్మీయుల‌ను క‌న్నీటి సంద్రంలో ముంచివేస్తున్నారు. క‌న్న‌వారికి క‌డుపుకోత‌ను మిగుల్చుతున్నారు. ఏమైందో ఏమో కానీ ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న బ‌షీరాబాద్‌లో క‌ల‌కలం రేపింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌కు చెందిన చంద్రిక అనే విద్యార్థిని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో (4th ఇయర్ సివిల్) సంవత్సరం చదువుతున్నది. ఇటీవ‌ల క‌ళాశాల ప్రారంభం కావ‌డంతో ఇంటి నుంచి వ‌చ్చి పేట్ బ‌షీరాబాద్ ప‌రిధిలోని మైసమ్మగూడ లోని కృప వసతి గృహంలో ఉంటున్నది. రోజు అక్క‌డి నుంచే క‌ళాశాల‌కు వెళ్లి వ‌స్తున్న‌ది. ఏమైందో ఏమో కానీ మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌స‌తి గృహం భవనంపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఈ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. పెట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విద్యార్థిని మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం లో నిజానిజాలు తేలే అవకాశాలు ఉన్నట్లు పోలీసుల వెల్లడిస్తున్నారు.

బ‌షీరాబాద్‌లో క‌ల‌కలం.. బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts