న‌గ్న వీడియోల‌తో యువ‌కుడికి యువ‌తి బ్లాక్‌మెయిల్‌

March 13, 2021 at 11:49 am

సోష‌ల్ మీడియా మాన‌వ సంబంధాల‌ను పెంచ‌డ‌ము అటుంచితే అన‌వ‌స‌ర చిక్కుల‌ను తెచ్చిపెడుతున్న‌ది. ముక్కుమొహం తెలియ‌ని వారి తేనే మాట‌ల‌కు పొంగిపోయి అనేక మంది యువ‌కులు, యువ‌తులు త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. లేని చిక్కుల్లో ప‌డుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఢిల్లీలోని నలసోపారా ఏరియాకు చెందిన యువకుడు గౌరవ్ (24)కు ఓ రోజు రాత్రి 9 గంటలకు ఓ యువతి నుంచి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ వ‌చ్చింది. పంపింది అందమైన అమ్మాయి కావ‌డంతో వెంటనే ఓకే చేసేశాడు. ఆ తర్వాత ఆమె చాటింగ్ మొదలుపెట్ట‌గా మ‌న‌వాడూ కంటిన్యూ చేశారు. కొన్ని రోజుల్లోనే ఇద్ద‌రు స‌న్నిహితుల‌య్యారు. ఇద్ద‌రూ క‌లిసి వాట్సాప్ కు షిఫ్ట్ అయ్యారు. మెల్లగా వీడియో చాట్ మొదలుపెట్టుకున్నారు. ఆ అమ్మాయితో ఊహాలోకంలో విహ‌రిస్తున్నాడు గౌర‌వ్‌.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ఓ రోజు రాత్రి వేళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది అమ్మాయి. నిద్రపోవడం మానేసి ఆమెతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. మెల్ల‌గా నీ బాడీ చూడాలని ఉంది… అది… ఆశ్చర్యపోయాడు. ప్లీజ్… చూపంచవా… నా కోసం అంది… షర్ట్ విప్పాడు… సూపర్ బాడీ… మిగతావి కూడా విప్పి చూపించు… అంది… మొహమాట పడ్డాడు. నేనూ చూపిస్తా… ముందు నువ్వు చూపించు అంది… సరే అని బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కనిపించాడు. అటూ ఇటూ తిరగమంటే తిరిగాడు. అన్నీ ఆమె చెప్పినట్లు చేశాడు. ఆ తర్వాత నువ్వు కూడా విప్పు అంటే… ఛీ నాటీ అంటూ కాల్ కట్ చేసింది. ఆ జ్ఞాప‌కాల్లో మునిగిపోయి ఉండ‌గా రెండ్రోజుల తర్వాత అతని వాట్సాప్ నంబర్‌కి వ‌చ్చిన వీడియోను చూసి కంగుతిన్నాడు. త‌న‌ నగ్న వీడియో చూసి బిత్త‌ర‌పోయాడు. అదీగాక తనకు రూ.51,00,000 పంపాలని, లేకుంటే ఆ వీడియోని అతని ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు, ఆఫీసులో ఉద్యోగులు అందరికీ పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. షాకైన అతను వెంటనే తులింజ్ పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ యువతి మొబైల్ నంబర్ స్విచ్ఛాఫ్ వస్తుండ‌గా పోలీసులు ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

న‌గ్న వీడియోల‌తో యువ‌కుడికి యువ‌తి బ్లాక్‌మెయిల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts