ఆ యంగ్ హీరోతో పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

March 5, 2021 at 9:39 am

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌ల కానుంది. హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య‌తో పూరీ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందుకే ఈ లోపు ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు పూరీ జ‌గ‌న్నాథ్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. నాగ శౌర్య‌.

ఒక ప్రేమకథతో నాగశౌర్యను డైరెక్ట్ చేయడానికి పూరీ ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌. కాగా, ప్రస్తుత శౌర్య సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ‘ల‌క్ష్య’ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

Naga Shourya Profile Biography Family Photos and Wiki and Biodata Body  Measurements Age Wife Affairs and More

ఆ యంగ్ హీరోతో పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts