
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం `లైగర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆ చిత్రం తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా ఉంటుందని ఇప్పటికే విజయ్ ప్రకటించాడు.
ప్రస్తుతం `పుష్ప` చేస్తున్న సుకుమార్.. ఆ తర్వాత విజయ్‌తోనే సినిమా చేస్తాడని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. విజయ్‌కు సుకుమార్ షాకి ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ్-సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రం.. ఒక వార్ డ్రామా అని.. దీనికి భారీ బడ్జెట్ తో పాటు టైం కూడా ఎక్కువగా అవసరం పడుతుందని తెలుస్తుంది.
అందుకే మరి కొన్నాళ్లు అయిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ను పక్కన పెట్టి.. పుష్ప తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు సుక్కూ రెడీ అయినట్టు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా.. కాదా.. అన్నది తెలియాల్సి ఉంది.