ఆక‌ట్టుకుంటున్న `ఈ అమ్మాయి(EMI)` టీజ‌ర్‌!

March 2, 2021 at 5:16 pm

బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఈ అమ్మాయి(EMI)`. ఈ చిత్రం ద్వారా దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. శ్రీఅవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దొంతు బుచ్చయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాకెట్ రాఘ‌వ‌, ధన్‌‌‌రాజ్, హ‌రితేజ‌, బిగ్‌బాస్ ఫేమ్ మ‌హేష్‌‌, నోయ‌ల్, స‌మీర్‌ వంటి వారు కీల‌క పాత్ర పోషించాడు. వివిధ ద‌శ‌ల్లో అమ్మాయిలు ఎదుర్కొనే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్ని క‌థాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే తాజా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. ఆ టీజ‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

ఆక‌ట్టుకుంటున్న `ఈ అమ్మాయి(EMI)` టీజ‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts