ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 205 ఆల్ అవుట్..!

March 4, 2021 at 4:01 pm

భారత్ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా ఇదివరకే మూడు టెస్టు మ్యాచ్లు పూర్తి అవ్వగా టీమిండియా 2 – 1 తేడాతో ముందంజలో ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ ను అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు విజయం సొంతం చేసుకోగా ఆ తర్వాత టీమిండియా తనదైన శైలిలో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ముందంజలో ఉంది. ఇక తాజాగా నేడు నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో మొదలైంది.

ఇక స్కోరు వివరాలు చూస్తే.. టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇందులో భారత బౌలర్లు అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీసుకోగా, రవిచంద్ర అశ్విన్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకుని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ల విషయానికి వస్తే.. బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ చేయగా మిగతా బ్యాట్స్ మెన్స్ పెద్ద పరుగులు చేయలేకపోయారు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 205 ఆల్ అవుట్..!
0 votes, 0.00 avg. rating (0% score)