
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రష్మిక..గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు చేసి.. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక.
ఇదిలా ఉంటే..తాజాగా ఓ అభిమాని అందరి ముందు రష్మిక తలలో పూలు పెట్టేశాడు. అయితే ఇది రియల్‌గా కాదు.. రీల్‌గా. పూర్తి వివరాల్లోకి వెళ్తే..రష్మిక కన్నడలో నటించిన `పొగరు` చిత్రం విడుదల అయింది. నందన్‌కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధృవ సర్జా హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు.
అయితే ఓ కన్నడ అభిమాని.. పొగరు సినిమా పోస్టర్లో రష్మిక మందన్న తలలో పూలు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోపై కొందరు రకరకాల కామెంట్స్ చేస్తుంది.
#RashmikaMandanna big fan of you mam #Dhanush pic.twitter.com/qpgfH5nJH8
— MSR᭄υꜱɑɱɑ༻꧂ (@MSR29344962) March 1, 2021