రాజ‌శేఖ‌ర్ కుమార్తె త‌మిళ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!!

March 2, 2021 at 2:57 pm

టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన విషయం అందరికి తెలిసిందే. రాజ‌శేఖ‌ర్ జీవిత దంపతల‌ రెండో కుమార్తె శివాత్మిక దొర‌సాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా, ఇందులో ఆమె న‌ట‌నకు మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు మ‌రో మూవీ చేస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త‌మిళంలోను ఆమె తన అదృష్టం ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.

కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ త‌మిళంలో ఆనందం విల‌య‌దుమ్ వీడు అనే త‌మిళ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నంద పెరియ‌స‌మి తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులలో కార్తీక్ స‌ర‌స‌న శివాత్మిక హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో అబ్బాయిలంద‌రు ఒక వైపు , అమ్మాయిలంద‌రు మరోవైపు ఉండి తమ బ‌ల ‌బ‌లాలు ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ అందరిని బాగా ఆక‌ట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే మూవీకి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు మేకర్స్.

రాజ‌శేఖ‌ర్ కుమార్తె త‌మిళ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts